చెల‌రేగిన నాథ‌న్ లియాన్

భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ పై ఆశలు పెట్టుకున్న అభిమానికి మరోసారి నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో ఘోర వైఫల్యాన్ని మూట గట్టుకున్న భారత్ జట్టు.. రెండో టెస్టులో కూడా అదే దిశలో పయనిస్తోంది. మొన్నటి మ్యాచ్ లో స్పిన్నర్ ఓకీఫ్ కు లొంగిపోయిన విరాట్ సేన..  ఈ మ్యాచ్ లో మరో స్పిన్నర్ నాథన్  లియాన్ కు దాసోహమైంది. లియన్ దెబ్బకు భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 71.2 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసింది.ఎనిమిది వికెట్లు సాధించిన లియన్ టీమిండియా పతనాన్ని శాసించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత ఓపెనర్ అభినవ్ ముకుంద్(0)పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీగా ముకుంద్ అవుటయ్యాడు. అలా ప్రారంభమైన భారత్ పతనం ఏ దశలోనూ ఆగలేదు. ప్రతీ సెషన్ లోనూ కీలక వికెట్లను చేజార్చుకోవడంతో భారత్ జట్టు రెండొందల మార్కును కూడా చేరలేకపోయింది. భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్(90; 205 బంతుల్లో 9 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. భారత్ ఆటగాళ్లలో రాహుల్ తర్వాత పూజారా(17), కోహ్లి(12), రహానే(17), నాయర్ (26) లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు కావడం గమనార్హం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *