ఫస్ట్ లుక్: మహేష్ బాబు స్పైడర్

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ చిత్రానికి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. స్పైడర్, ఏజెంట్ గోపి, సంభవామి తదితర పేర్లపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ స్పైడర్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ ఖరారుతో పాటు ఫస్ట్‌లుక్ కూడా అదింరిందనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నది. ఫస్ట్‌లుక్ విడుదల కాగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహేశ్‌బాబు ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నది. ఖుషీ దర్శకుడు సూర్య విలన్‌గా కనిపిస్తారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 23న తమిళ, తెలుగు భాషల్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

ఈ చిత్రంలో కీలకమైన యాక్షన్ పార్ట్‌ను హాలీవుడ్ స్ఠాయిలో వియత్నంలో రెండు వారాలపాటు చిత్రీకరించారు. వియత్నాంలో దక్షిణాది చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు జయం రవి నటించిన వనమాగన్ చిత్రాన్ని వియత్నాంలో షూట్ చేశారు. సినీ పరిశ్రమలో కనీవిని ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లను, ప్రధానంగా ఛేజింగ్ సీన్లను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్లకు వియత్నాంకు చెందిన స్థానిక ఫైట్ మాస్టర్ రూపకల్పన చేయడం విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published.