అల్లు అరవింద్ మీద మహేష్ ఫ్యాన్స్ అటాక్

నిన్నటి దాకా చెప్పను బ్రదర్ అన్న అల్లు అర్జున్ మాట ట్రెండింగ్ లో ఉంటే ఇప్పుడు అల్లు కుటుంబానికి మరొక తలనొప్పి వచ్చి పడింది. ఈ సారి మహేష్ ఫ్యాన్స్ కోపంతో అల్లు అరవింద్ ని ..చీప్ అల్లు పాలిటిక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తూ ట్విట్టర్ లో ఓ రేంజిలో ఆడుకుంటున్నారు.

తాజాగా మరో కాంట్రవర్శీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాడు అల్లు అరవింద్. ఈసారి ఆయన మీద అటాక్ చేస్తోంది పవన్ ఫ్యాన్స్ కాదు.. మహేష్ బాబు అభిమానులు కావడం విశేషం. ఇప్పుడు కొత్తగా వాళ్లతో వైరం ఏంటి అంటే.. తన కొడుకు సినిమా ‘సరైనోడు’ కోసమని ఉత్తరాంధ్రలో థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారట అరవింద్. దీంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు అక్కడ సరిపడా థియేటర్లు దొరకట్లేదట.

దీంతో మహేష్ ఫ్యాన్స్ అంతా ట్విట్టర్ లో ‘చీప్ అల్లు పాలిటిక్స్’ అనే నెగెటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అరవింద్ మీద విరుచుకుపడుతున్నారు . థియేటర్ల బ్లాకింగ్ విషయంలో వాస్తవాలేంటో తెలియదు కానీ ..మహేష్ ఫ్యాన్స్ ఇలా ఓ రేంజిలో తీవ్ర స్దాయిలో మండిపడటం ఎవరూ ఊహించని పరిణామం.

ఆల్రెడీ అల్లు అర్జున్ మాటను పట్టుకుని ‘చెప్పను బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ఇప్పడు మహేష్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేశారు. మొత్తానికి ‘సరైనోడు సక్సెస్ ఆనందంలో ఉన్న సమయంలో ఈ లేని పోని వివాదాలేంటో అర్థం కావట్లేదు అల్లు ఫ్యామిలీకి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *