మహేష్ 24వ చిత్రం ప్రారంభం

క్రేజీ ప్రాజెక్ట్ కి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. శ్రీమంతుడు చిత్రం లాంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన మహేష్, కొరటాల కాంబో త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం తాజాగా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మహేష్ పలు కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన ఆయనకి బదులు నమ్రత ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని యూనిట్ భావిస్తోండగా టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే కొరటాల ఇప్పటి వరకు తన సినిమాలకు టాప్ హీరోయిన్లనే సెలక్ట్ చేయగా ఈ సినిమాకు మాత్రం న్యూ హీరోయిన్ ని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట. కథ రీత్యా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నట్టు టాక్. మహేష్ 24వ చిత్రం ద్వారా కొరటాల అండ్ టీం మరో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *