మే 20నే బ్రహ్మోత్సవం పండుగ

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పీవీపీ సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో నిర్వహించారు.

ఎప్పటిలాగానే స్టేజ్ మీద.. ఆడియో వేదిక వద్ద.. తనకు సాంప్రదాయమైన రిలీజ్ డేట్ ప్రకటించే ప్రక్రియను మరోసారి చేపట్టాడు మహేష్ బాబు. అయితే ఈ మధ్యన ఎక్కువసార్లు పండగలకు వచ్చాడు కాబట్టి.. పండుగ 3-4 రోజుల ముందే అంటూ సెలవిచ్చేవాడు. కాని ఈసారి మాత్రం.. మనకు బ్రహ్మోత్సవం ఎప్పటినుండి స్టార్ట్ అవుతుందో చెప్పాడు.

”నేను చాలా తక్కువగా మాట్లాడతాను” అంటూ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేస్తూ.. ”ఎవరి గురించైనా ఎక్కువగా మాట్లాడలేదు అంటే.. అది ఖచ్చితంగా అభిమానుల గురించే. స్టేజీ మీద ఎప్పుడూ మీ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎవరిమీదనైనా ఎక్కువ ప్రేమ ఉంటే వారి గురించి ఎక్కువగా మాట్లాడం. అందుకే మీ గురించి మాట్లాడను. మీరు నా గుండెల్లో ఉంటారు. నన్ను ఈ స్థానంలో ఉంచినందుకు కృతజ్ఞతలు” అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి చెప్పాడు మహేష్. ”ఇక మనకు బ్రహ్మోత్సవం మొదలయ్యేది మే 20 నుండి. ఆరోజునే మన పండగ మొదలవుతుంది” అంటూ అసలు విషయం కూడా చెప్పేశాడు.

సో.. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”బ్రహ్మోత్సవం” చూడ్డానికి రెడీ అయిపోండి మరి. మే 20నే మనకు పండుగ.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *