మీరా జాస్మిన్ పరిస్థితి ఇంత దారుణమా?!!

నటి మీరా జాస్మిన్ గుర్తుందా… భద్ర, గుడుంబా శంకర్ వంటి ఫేమస్ సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈ కేరళ కుట్టి అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు తక్కువ సినిమాలు తీసినా తొందరగా కనెక్ట్ అయింది. తెలుగు, తమిళ, మళయాళ సినిమాలన్నిటిలో ఛాన్సులు దక్కించుకుని అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఆమె జీవితం ఇప్పుడు అస్సలు బాగోలేదని ఆమె స్నేహితులు చెబుతున్నారు.

సినిమాల్లో వరుస అవకాశాలు దక్కుతున్న సమయంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మాంటోనియన్ రాజేష్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రాజేష్ కి బ్రేకప్ చెప్పిన మీరా దుబాయ్ కి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ అనీల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకుంది. అయితే అప్పటికే పెళ్లి అయిన జాన్.. మీరాను సినిమాలకు దూరంగా ఉంచాడు.అనిల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మీరాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మీరా పెళ్లి కేరళలోని త్రివేండ్రం చర్చిలో ఘనంగా జరిగింది. ఐతే పెళ్లి తర్వాత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పలు సమస్యలు ఏర్పడ్డాయని, అందుకే ఇప్పటికీ కూడా వీరిద్దరూ ఆ చర్చి చుట్టూనే సర్టిఫికేట్ కోసం తిరిగారు. చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు. ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్న మీరా.. అనిల్.. రెండేళ్లు తిరిగేసరికి విడిపోతుండటం ఆశ్చర్యం.

పెళ్లయిన ఏడాదికే వీళ్లిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట. ఏడాది నుంచి విభేదాలతోనే కలిసి సాగుతున్న ఈ జంట.. చివరికి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. మీరా ఇప్పటికే అనిల్ కు దూరంగా ఉంటోంది. అతడికి దూరమయ్యాకే మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయడానికి కూడా రంగం సిద్ధంచేసుకుంది. మొత్తానికి పెళ్లి చేసుకున్నీ మీరా జాస్మిన్ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమెకు తిరిగి సినిమాల్లో నటించే అవకాశాలు రావాలని, ఆమె మరిన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు రావాలని మనమూ కోరుకుందాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *