దేశం విడిచి వెళ్లాడు: విజయ్ మాల్యా జంప్

విజయ్ మాల్యా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా చూడాలంటూ స్టేట్ బ్యాంకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంలో దానిపై విచారణ కూడా బుధవారం కొనసాగాల్సి ఉంది. మాల్యా దాదాపు 9వేల కోట్ల వరకు బాకీ ఉన్నారని, అందువల్ల ఆయన వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని బ్యాంకులు కోరాయి. తాను లండన్‌లో సెటిల్ అవుతానని ఇటీవలే మాల్యా చెప్పారు. తనకు సురక్షితంగా ఉండే వేరే దేశంలో తలదాచుకున్నారట.

మాల్యా లండన్‌కు వెళ్లిపోతున్నారన్న వార్తలు తెలియగానే ఉలిక్కిపడ్డాయి.అయితే, ఆయన తరఫు అధికార ప్రతినిధి మాత్రం.. మాల్యా ఎక్కడున్నారో తెలియదని, కేవలం ఈ మెయిల్స్ ద్వారానే తమకు అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి వైదొలగినందుకు మాల్యాకు మరో లిక్కర్ కంపెనీ డియాజియో ఇచ్చిన రూ. 515 కోట్లను ఖర్చుపెట్టేందుకు వీల్లేదని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశించింది గానీ, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేసేందుకు మాత్రం అనుమతించలేదు.ఆ తర్వాత.. మాల్యాకు వందలాది కోట్ల రూపాయల రుణాలచ్చిన 14బ్యాంకులు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కాయి. తమ అప్పులను తీర్చేదాకా విజయ్ మాల్యాను దేశం విడిచివెళ్లకుండా కట్టడి చేయాలని ఆ బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *