అదృష్టం అంటే ఇతడిదే.. మహీంద్రా కంపెనీ మనసు దోచుకున్న ఆటో డ్రైవర్…

కార్ల కంపెనీని దృష్టిని ఆకర్షించి అనుకోకుండా తన కలలు నిజం చేసుకున్నాడో సామాన్యుడు… ఏకంగా సదరు కంపెనీ చైర్మన్ నుంచే ఊహించని బహుమతి అందుకున్నాడు.. కేరళకు చెందిన సునీల్ అనే ఔత్సాహిక ఆటోడ్రైవర్ తన ఆటోను మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ మాదిరిగా డిజైన్ చేసి తిప్పుతున్నాడు.  సునీల్ ఐడియాను మెచ్చుకుంటూ అనిల్ పానికర్ అనే వ్యక్తి రోడ్లపై తిరుగుతున్న ‘మూడు చక్రాల స్కార్పియోను’ ఫోటో తీసి ట్విటర్లో పోస్టుచేశాడు. ‘‘స్కార్పియో డిజైన్ ఎంత సాధారణంగా మారిపోయిందో… భారత రోడ్లపై ఎంత పాపులర్ అయిందో ఈ ఫోటోను చూస్తే తెలుస్తుంది.. ‘‘పెద్ద కలలు’’ కనాలన్న ఈ మనిషి దృక్పథం అర్థమవుతుంది’’ అని పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేయడంతో.. క్షణాల్లో వైరల్లా వ్యాపించింది.
సునీల్ ఆలోచనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్ర వెంటనే స్పందించారు. ‘‘అద్భుతం… ఇది ‘‘ఎదిగేందుకు’’ మంచి మార్గం.. ఈ ఫోటో షేర్ చేసినందకు కృతజ్ఞతలు.. అతడు ఎక్కడున్నాడో గుర్తించి చెప్పగలరా? నేను ఆ వాహనాన్ని కొనుక్కుని మా మ్యూజియంలో పెట్టుకుంటాను.. ప్రతిగా అతడికి నాలుగు చక్రాల వాహనాన్ని ఇస్తాను’’ అంటూ స్పందించారు. రెండువారాల్లోగా అతడి వివరాలు కనుక్కోవడం… స్వయంగా ఆనంద్ మహీంద్రా చేతుల మీదుగా మహీంద్రా సుప్రో మినీ ట్రక్కును అతడి చేతుల్లో పెట్టడం చకచకా జరిగిపోయాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *