డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్

మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా…తనదైన యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫైర్ బ్రాండ్‌, హైపరాక్టివ్ పర్సన్‌ అనే ముద్ర ఆమెపై పడింది. వాస్తవానికి మంచు లక్ష్మి… మోహన్ బాబు కూతురుగా, సినిమా నటిగా వచ్చిన గుర్తింపు కంటే తన హైపర్ యాక్టివ్ యాటిట్యూడ్ ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతే కాదు…కొన్ని విషయాల్లో మంచు లక్ష్మి ప్రవర్తనగానీ, ఆమె వ్యవహార శైలిగానీ చూసే వారికి ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. అలాంటి సంఘటనే తాజాగా డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో చోటు చేసుకుంది. అందరు సెలబ్రిల్లాగానే మంచు లక్ష్మి కూడా పెళ్లి వేడుకకు హాజరైంది. వేదికపై ఉన్న క్రిష్-రమ్య దంపతులను అందరూ ఆశీర్వదిస్తూ వెళ్లిపోతున్నారు.

మరి అందరిలా విష్ చేస్తే తన ప్రత్యేకత ఏముంటుంది? అనుకుందో? ఏమో?…. క్రిష్ తొడపై కూర్చుకుని అతని మెడపై చేయేసి కబుర్లాడటం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి మంచు లక్ష్మి ఇలా చేయడం క్రిష్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఆమె యాటిట్యూడ్ తో చాలా ఇబ్బంది పడ్డట్లు స్పష్టం అవుతోంది. క్రిష్ తనకు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం… మరీ ఇలాంటి సందర్భంలో, ఇలాగేనా? వ్యవహరించేది అంటూ అంతా తీరును తప్పుబడుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.