ఆర్థిక వ్యవస్థపై మోడీకి మన్మోహన్ సూచనలు

ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించడంలో భాజపా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. త్వరగా ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడితే వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్నేళ్ళ సమయం పడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని ఉందని అంగీకరించడమే మొదటి దిద్దుబాటు చర్య అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో కొన్ని సూచనలు చేశారు. జి‌ఎస్‌టి ని హేతుబద్ధీకరించాలి. వ్యవసాయ రంగంలో సమస్యల్ని పరిష్కరించాలి. విపణిలో ద్రవ్య లభ్యత సమస్యను పరిష్కరించాలి.జాతీయ బ్యాంకులతో పాటు, బ్యాంకేతర ఆర్టిక సంస్థలు కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎగుమతులను మరింత పెంచే ప్రయత్నం చేయాలని చెప్పారు.

Videos