జీఎస్టీ గుడ్ న్యూస్..కార్లపై భారీ డిస్కౌంట్స్

జులై 1  నుంచి  గూడ్స్‌  సర్వీసు టాక్స్ (జీఎస్‌టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ  వాహన తయారీదారులు,  కంపెనీల డీలర్లు  కార్ల ధరలను భారీగా తగ్గించేశారు.  వివిధ మోడళ్లపై  గత డిస్కౌంట్లను మరింత పెంచి మొత్తంగా  దాదాపు  రూ.10 వేల నుంచి రూ.30వేలకు తగ్గింపు ధరల్లో  కార్లను అందుబాటులోకి తెచ్చాయి.  జూన్‌ నెలలో అమ్మకాలపై కన్నేసిన  డీలర్లు ఈ ప్రత్యేక  తగ్గింపును అందిస్తున్నాయి.

గతంలో ప్రకటించిన  నగదును తగ్గింపును మరింత పెంచాయి. ముఖ్యంగా  మారుతి  వాగాన్ ఆర్ పై డిస్కౌంట్‌ను  రూ.30వేలకు (గతంలో రూ.20వేలు) పెంచగా, స్విఫ్ట్‌ పై  రూ. 10వేలనుంచి రూ.20వేలకు పెంచింది. సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది.  ఆల్టో పై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును రూ. 30వేలనుంచి మరో అయిదువేలకు పెంచింది. ఈ  డిస్కౌంట్తోపాటు ఉచిత భీమా, లాభదాయక బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి.

– దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ – కోల్ కతాల్లోని మారుతి డీలర్లు ఆల్టో – వాగన్ ఆర్ – సెలెరియో – స్విఫ్ట్ వంటి వాహనాలపై నగదు రాయితీలను అందించనున్నట్లు ప్రకటించింది.

– మారుతి  వాగాన్ ఆర్ పై డిస్కౌంట్ గతంలో రూ.20వేలు ఉండగా తాజాగా దాన్ని రూ.30వేలకు పెంచింది.

-స్విఫ్ట్ పై రూ. 10వేలనుంచి రూ.20వేలకు సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది.

–హ్యుండాయ్ డీలర్లు తమ అమ్మకాల గురించి వివరిస్తూ అధనపు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపారు.

— మహీంద్రా ఆండ్ మహీంద్రా డీలర్లు తమ కంపెనీకి చెందిన స్కార్పియో హైబ్రిడ్పై  రూ. 30000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు.

— హుందాయ్ డీలర్లు తమ కార్లపై  డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్ గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది.

–జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ  టొయోటాకు చెందిన  ఇన్నోవా ఫార్చూనర్ ధరలు కూడా దిగిరానున్నట్లు చెప్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *