రెండు రోజులు…రెండు ప్లాంట్లను మూసివేస్తున్న మారుతి సుజుకి

ఆటోమొబైల్‌ విక్రయాలు పడిపోవడంతో దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 7, 9 తేదీల్లో ప్రయాణీకుల వాహనాలను రూపొందించే గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లను మూసివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని కంపెనీ బుధవారం బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది. మారుతి సుజుకి నిర్ణయంతో కంపెనీ షేర్లు 2.36 శాతం మేర నష్టపోయాయి. కాగా గత ఏడాది ఆగస్ట్‌ లో మొత్తం వాహన విక్రయాలు 1,68,725 కాగా ఈ ఏడాది ఆగస్ట్‌ లో అమ్మకాలు 32.7 శాతం పతనమై 1,11,370 వాహనాలకే పరిమితమయ్యాయి. మరోవైపు అన్ని కంపెనీల ఆటోమొబైల్‌ విక్రయాలు తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు రెట్టింపయ్యాయి.

Videos