నిహారికను ఆ సన్నివేశాల్లో చూసి ఫీలవుతున్న మెగాభిమానులు..?

మెగా ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా వస్తోందంటే మెగా అభిమానులు ఆమెన్ స్క్రీన్ పై ఎలా చూడాలో అని బాధపడ్డారు. మెగా పెద్దల కూడా మొదట ఆమెను హీరోయిన్ గా ఎంకరేజ్ చెయ్యలేదు. కానీ చివరకు నిహారిక పట్టుదలతో మెగా పెద్దలు కూడా ఆమెను ఆశీర్వదించారు. దీంతో మెగా అమ్మాయి సినిమా మొదలై పోస్టర్లు బయటికొచ్చాయి. పోస్టర్లలో నిహారిక తెలుగమ్మాయిలానే సంప్రదాయంగా చీరకట్టులో కనబడే సరికి చాలనుకున్నారు.

కానీ తీరా సినిమా కెళ్ళి చూడగానే పూర్తి డెప్త్ ఉన్న లవ్ స్టార్ కావడంతో హీరోకి ఆమెకు మధ్య కౌగిలింత, ముద్దు సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. దీంతో మా మెగా ఫ్యాఅమిలీ నుండి వచ్చిన అమ్మాయి ఇలాంటి పాత్ర చేయడం ఏమిటి అని ఫీలయ్యారు. కొందరు సినిమా అంటే ఎవరైనా ఒకటే. అది నటనలో భాగం. మరీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె నటనకు అభినందనలు తెలిపారు. కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని అంత ఈజీగా తీసుకోలేకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *