ప‌రాయి దేశంలో భార్య చేతిలో ట్రంప్ కు ఘోర అవ‌మానం

త‌న తిక్క‌తో ప్ర‌పంచ‌దేశాల్ని, ఉద్యోగుల్ని ఇబ్బందిపెడుతున్న అమెరికా అధ్య‌క్షుడి డొనాల్డ్ ట్రంప్ కు అవ‌మానం జ‌రిగింది. అమెరికా అధ్య‌క్షుడి హోదాలో విదేశి ప‌ర్య‌ట‌న చేస్తున్న ట్రంప్ కు త‌న భార్య మెలానియా ట్రంప్ చేతిలో ఘోర అవ‌మానాన్ని చ‌విచూశారు. జ‌రిగిన సంఘ‌ట‌న చిన్న‌దే అయినా ప‌రాయిదేశంలో ఓ అగ్ర‌దేశ అధినేతకు ఇలా జ‌ర‌గ‌డం పెద్ద సెన్సెష‌న్ క్రియేట్ చేస్తుంది. దీనిపై అయ్యో పాపం ట్రంప్ కు ఎంత అవ‌మానం జరిగిందో చూడండి అంటూ  దానికి సంబంధించిన వీడియోల‌ను నెటిజ‌న్లు షేర్ల‌మీద షేర్లు చేస్తున్నారు.

అధ్య‌క్షుడి హోదాలో విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే సౌదీ అరేబీయా ప‌ర్య‌ట‌న ముగించుకున్నారు. అనంత‌రం ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఇజ్రాయెల్ విమానాశ్ర‌యంలో వీరికి స్వాగ‌తం ప‌లికేందుకు హంగు ఆర్భాటాల‌తో పెద్ద ఎత్తున రెడ్ కార్పెట్ ప‌రిచి ఆహ్వానించారు. ఈ స‌మ‌యంలో ట్రంప్ త‌న భార్య మెలానియా చేయి ప‌ట్టుకోని న‌డ‌వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అంతే అలా న‌డ‌వ‌డం ఇష్టం లేని మెలానియా ట్రంప్ చేతిని తోసేసింది. ఈ హాటాత్ ప‌రిణామానికి కంగుతిన్న ట్రంప్..ఆ ఘ‌ట‌న‌ను స‌రిదిద్దే ప్ర‌యత్నం చేశాడు. పాపం ఈ య‌వ్వారాన్ని చిత్రీక‌రించిన  ఇజ్రాయెల్ మీడియా  అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అవమానం అంటూ పెద్ద ఎత్తున ప్ర‌సారం చేసింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *