“మెర్సల్’ ప్రీమియర్ టాక్!

తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన దీపావళి పర్వదినం సందర్భంగా “మెర్సల్” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాప్ స్టార్ విజయ్ ట్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమాలో సమంత, కాజల్ వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు. ధియేటిరికల్ ట్రైలర్ అంచనాలకు మించి ఉండడంతో, “మెర్సల్” సినిమా బాక్సాఫీస్ వద్ద చెలరేగడం ఖాయమనే భావనలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను విజయ్ అందుకున్నాడా? అంటే యుఎస్ లో పడిన ప్రీమియర్ టాక్ ఆశాజనకంగా లేకపోవడం విశేషం.

ముఖ్యంగా మూడు పాత్రల్లో విజయ్ ను చూపించిన దర్శకుడు అట్లీ, ఒక్క పాత్రలోనూ అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే హీరోయిజాన్ని చూపించకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. టేకింగ్ పరంగా అట్లీ సంతృప్తి పరిచినా, కధ విషయంలో ప్రేక్షకులను మెప్పించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయితే సాధించలేదన్నది ప్రీమియర్ టాక్. సినిమా అంతా రొటీన్ గా ఉన్నప్పటికీ ఫస్టాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా, సెకండాఫ్ లో రివీల్ చేసిన అసలు కధలో మజా లేకపోవడం గమనించదగ్గ విషయం.

ఓవరాల్ గా ఫస్టాఫ్ ఓకే అనిపించినా, సెకండాఫ్ లో దర్శకుడు కధను మలిచిన తీరు ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రీమియర్స్ డివైడ్ టాక్ తో ప్రారంభమయ్యాయి. మూడు పాత్రల్లో విజయ్ న్యాయం చేసినప్పటికీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయారనేది ఫస్ట్ టాక్. సినిమాలో ఫోటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఎక్కువ మార్కులు పడ్డాయంటే అట్లీ ఏ విధంగా వెండితెరపై కధను మలిచారో అర్ధం చేసుకోవచ్చు. మూడు పాత్రలలో విజయ్ ను చూడాలనుకునే అభిమానులకు మాత్రం ‘మెర్సల్’ పండగేనని చెప్పవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published.