మిగ్-21 యుద్ధ విమానం నేలకూలింది…

 

మిగ్-21 యుద్ధ విమానం నేలకూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన బుధవారం గ్వాలియర్‌ లోని ఎయిర్ బేస్‌లో 11 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు 27 యుద్ధ విమానాలు, 15 ఫైటర్ జెట్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదానికి గురైన వాటిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రయాణించిన మిగ్ – 21 కూడా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాక్ ఎయిర్ ఫోర్స్ దాన్ని నేలకూల్చిన విషయం తెలిసిందే.

 

Videos