అక్కడ పాలకన్నా డీజిల్, పెట్రోల్ ధరలు…

పాకిస్తాన్‌లో నెలకొన్ని ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాల ధరలు పోటీ పడుతున్నాయి. గత నెలలో లీటరు పెట్రోల్ ధర రూ. 117.83 (పాకిస్తాన్ రూపాయిలలో)కు చేరుకోగా, డీజిల్ ధర లీటరుకు రూ. 132.47గా ఉంది. అదేవిధంగా లీటరు పాల ధర రూ. 140కు చేరుకుంది. పాకిస్తాన్‌లో పాల తరహా నిత్యావసర వస్తువుల ధరలు గతంలోనూ పెరిగాయి. అయితే ఇప్పుడు మొహర్రం సందర్భంగా పాల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్‌లో మహానగరాలుగా పేరొందిన కరాచీ, సింధ్‌లలో లీటరు పాల ధర రూ.140(పాకిస్తాన్ రూపాయిలలో)కు చేరుకుంది. పాలకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడటంతో కరాచీలో రూ. 120 నుంచి 140కి లీటరు పాలు అమ్మినట్టు ఒక దుకాణదారుడు వెల్లడించినట్టు పాక్‌ మీడియా తెలిపింది.

Videos