బాలకృష్ణతో జరుపుకున్న దీపావళి మర్చిపోలేను: రోజా

దీపావళి పర్వదినం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీపావళి అంటే తనకు ఎంతో ఇష్టమని.. అగ్ర హీరోయిన్‌గా ఉన్నా.. రాజకీయాల్లో జిజీగా ఉన్నా దీపావళి పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలు, సినిమాలు అన్నీ తనకు ఉండాల్సిందేని రోజా తెలిపారు. తన పిల్లలకు కూడా దీపావళి అంటే చాలా ఇష్టమని చెప్పారు. దీపావళి పండుగకు తన అన్నయ్య పిల్లలు కూడా తమ దగ్గరకే వస్తారని తెలిపారు. ఈ దీపావళికి పిల్లలతో కలిసి ‘ఇజం’ సినిమాకు వెళ్లానని చెప్పారు. ప్రతి దీపావళి తనకు ఎన్నో ఙ్ఞాపకాలను మిగిల్చుతోందని రోజా తెలిపారు.

అయితే, ‘పెద్దన్నయ్య’ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు.. తాను, బాలకృష్ణ కలిసి జరుపుకున్న దీపావళి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని చెప్పారు. ఆ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా దీపావళిని జరుపుకున్నామని గుర్తు చేసుకున్నారు. తనతోపాటు అందరూ బాగుండాలని, తన వల్ల పది మందికి మంచి జరగాలని ఎప్పుడూ భగవంతుడిని కోరుకుంటానని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

Videos

One thought on “బాలకృష్ణతో జరుపుకున్న దీపావళి మర్చిపోలేను: రోజా

  • August 30, 2019 at 2:11 pm
    Permalink

    Like!! I blog frequently and I really thank you for your content. The article has truly peaked my interest.

Leave a Reply

Your email address will not be published.