వైఎస్ వివేకా ఓడిపోవడానికి అసలు కారణాలివేనా.?

తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు ఆదేశాల మేరకు సమష్టి కృషితో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఎన్నికల ముందు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి బీటెక్‌రవి గెలుపు కానుకగా ఇస్తామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పైడిపాలెం ప్రాజెక్టు వద్ద సభలో ముఖ్యమంత్రికి స్వయంగా ఈ అంశాన్ని తెలియజెప్పారు. ఈ మేరకు జిల్లాలోని నాయకులు అంతా ఐక్యంగా పనిచేయడంతో ఇది సాధ్యమైంది. టీడీపీ ముందస్తు వ్యూహంతో వ్యవహరించడంతో ఎన్నికల ఫలితం సానుకూలంగా మారింది. శిబిరాల నిర్వహణ, సమీకరణలు, కోడ్‌ ప్రకా రం ఓటు వేయించుకోవడం, పోలింగ్‌కు ముందే మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే 30 మంది ఓటర్లను దగ్గరపెట్టుకోవడం ఇవన్నీ కూడా కలిసొచ్చాయి. వ్యూహం సక్రమంగా అమలు చేయడంలో పార్టీ నేతలు సఫలీకృతులయ్యారు.

ఆ ఆశే వైసీపీ కొంప ముంచింది..
తెలుగుదేశం పార్టీ సమీకరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తే వైసీపీ తమకు క్రాస్‌ ఓటింగ్‌ అనుకూలిస్తుందన్న ఆశతో నష్టపోయింది. తమ పార్టీ నుంచి పోయిన వారు కొందరు తమకు ఓట్లు వేస్తారని, అంతేకాకుండా వైఎస్‌ వివేకానందరెడ్డి నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటు అడగడంతో ఓటర్లు అందుకు అనుకూలంగా ఆయనకు ఓటు వేస్తారని భావిస్తూవచ్చారు. ఇలాంటి ఆశలతో క్రాస్‌ ఓటింగ్‌పై ఆధారపడ్డారు. అయితే తెలుగుదేశం నాయకులు క్రాస్‌ ఓటింగ్‌కు అడ్డుకట్ట వేశారు. కోడ్‌ ఇచ్చి ఓటేయమనడం, స్వయంగా నేతలు, బీటెక్‌రవి కుటుంబ సభ్యులు వారిని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించడం లాంటివి క్రాస్‌ ఓటింగ్‌కు అడ్డుకట్ట పడడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అనుకున్నదొకటైతే అయింది మరొకటి. వైసీపీ నేతలే కాదు జగన్‌‌మోహన్ రెడ్డి కూడా ఇదే అంచనాలలో వుండడం వైసీపీ ఎక్కువగా నష్టపోవడానికి కారణ మైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ముఖ్యనేతల కసరత్తు

జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జిల్లాలో జరిగే ఎన్నికలపై ప్రత్యేకదృష్టి సారించారు. రెండు, మూడు పర్యాయాలు వీరు జిల్లాలో పర్యటించారు. ఎక్కడ, ఏ నియోజకవర్గంలో చిన్న చిన్న విబేధాలు నాయకుల మధ్య నెలకొన్నా అవి ఈ ఎన్నికలకు నష్టం కలిగించకూడదన్న వ్యూహంతో అందరికీ సర్దిచెప్పగలిగారు. అసంతృప్తులు వుంటే బుజ్జగించారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఈ వ్యూహంలో ప్రధానపాత్ర పోషించారు.
వీరే కాదు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇనఛార్జిలు, పార్టీ ముఖ్యనేతలు పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎవరి మేరకు వారు కష్టపడ్డారు. ముఖ్య నేతలతో పాటు శిబిరంలో కీలకపాత్ర పోషించిన వారు వున్నారు. జడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డిప్రభాకర్‌రెడ్డి శిబిరానికి ముందు నుంచి సమీకరణల కూడికలు, శిబిర నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించ డంతో పాటు పలు రకాల వ్యూహాలలో పాలుపంచుకున్నారు. ఈయనతో పాటు పాండిచ్చేరి శిబిరంలో రాంగోపాల్‌రెడ్డి తనవంతు పాత్ర పోషించారు. ఇలా ఎవ రికి వారు కష్టపడి టీడీపీ అభ్యర్థిని గెలి పించడంతో పార్టీ ప్రతిష్ట కూడా పెరిగిం దనే చెప్పాలి.
Videos

89 thoughts on “వైఎస్ వివేకా ఓడిపోవడానికి అసలు కారణాలివేనా.?

Leave a Reply

Your email address will not be published.