ప్లైట్ దిగ‌గానే కేసీఆర్‌కు షాకిచ్చిన మోడీ

ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆదివారం తొలిసారిగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.ప్ర‌ధాని తొలిసారిగా త‌మ రాష్ర్టానికి వ‌స్తుండ‌డంతో సీఎం కేసీఆర్ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌, స‌భ‌ను అదిరిపోయే రేంజ్‌లో స‌క్సెస్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేశారు. అయితే మోడీ ప్లైట్‌లో దిగిన వెంట‌నే కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. తన ప్రత్యేక విమానం నుంచి దిగిన మోడీని ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు గవర్నర్ నరసింహన్.. కేంద్ర.. రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్.. బీజేపీకి చెందిన నేతలు పలువురు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

మోడీ విమానం దిగిన వెంట‌నే ఆయ‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కేసీఆర్ చేయిని ముందుకు చాపారు. అయితే మోడీ ఆయ‌న్ను ప‌ట్టించుకోకుండా ముందుగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే అప్ప‌ట‌కీ కేసీఆర్ వెంక‌య్య ప‌క్క‌కు చేరుకున్నారు. అయినా మోడీ షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు. మోడీ కేసీఆర్‌ను పెద్దగా పట్టించుకోలేదన్న భావన కలిగింది. అయితే.. అలాంటిదేమీ లేదన్న మాటను టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

మోడీని స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వచ్చి ఉండటంతో హడావుడిలో కేసీఆర్ కు మోడీ కరచాలనం ఇచ్చే అంశాన్ని పట్టించుకొని ఉండకపోవచ్చేమో కానీ.. మోడీ ప‌ర్య‌ట‌న‌ను లైవ్ టెలీకాస్ట్‌లో చూస్తోన్న వేలాది మందికి ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. కేసీఆర్ చేయి ముందుకు చాపినా మోడీ ప‌ట్టించుకోక‌పోవ‌డం..త‌ర్వాత మోడీ వెంక‌య్య వ‌ద్ద‌కు వెళ్ల‌గా అప్పుడు కూడా చేయి ఇచ్చేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం గ‌మనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *