మోటో ఎక్స్‌4 6జీబీ ర్యామ్ వేరియెంట్ విడుద‌ల

మోటోరోలా తన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేయగా ఇప్పుడు ఈ ఫోన్‌కు గాను 6 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను మోటోరోలా తాజాగా విడుద‌ల చేసింది. రూ.24,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్ లో ప్ర‌త్యేకంగా ల‌భిస్తున్న‌ది. ఈ సంద‌ర్భంగా ఈ ఫోన్‌ను కొనే యూజ‌ర్ల‌కు ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3వేల వ‌ర‌కు డిస్కౌంట్ వ‌స్తుంది.

మోటో ఎక్స్4 ఫీచర్లు…

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Videos

Leave a Reply

Your email address will not be published.