మార్చిలో ఎంపీ రామ్మోహన్ నాయుడి పెళ్లి … అమ్మాయి ఎవరో తెలుసా?

దివంగత టీడీపీ ముఖ్యనాయకుడు కింజారపు ఎర్రన్నాయుడి తనయుడు, ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తండ్రి మరణం కారణంగా చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు… తనదైన వాగ్దాటితో పార్లమెంట్ లోని హేమాహేమీ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆంగ్ల భాషలో పట్టు, స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో మాట్లాడే అంశాలు హైలెట్ అవుతుంటాయి. టీడీపీ నవతరంలో రామ్మోహన్ నాయుడి పాత్ర ఎంతో కీలకం కాబోతోందని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు అప్పుడప్పుడు చెబుతుంటారు.

ఇక ఇంకా పెళ్లి చేసుకోని ఈ యువనేత… వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి రెండో కుమార్తె శ్రావ్యతో రామ్మోహన్ నాయుడి పెళ్లి దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి అంగీకారం తెలపడంతో మార్చిలో రామ్మోహన్ నాయుడు, శ్రావ్య పెళ్లి జరగనుందని తెలుస్తోంది. సత్యనారాయణమూర్తి మొదటి కుమార్తె పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని… రెండో కుమార్తె శ్రావ్య పెళ్లి మార్చిలో రామ్మోహన్ తో జరుగుతుందని టాక్. మొత్తానికి ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ యువనేత పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి వరకు తెలియాలంటే.

Videos

Leave a Reply

Your email address will not be published.