కోడ‌లికి ఎంపీ సీటు బుక్ చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌క్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నార‌ని ఆయ‌న తాజా ప్ర‌ణాళిక‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోను విజ‌యం సాధించి మ‌రోసారి సీఎం అయ్యేందుకు ఆయ‌న అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని కూడా వ‌దులుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప‌రంగాను, పార్టీ ప‌రంగాను త‌న కుటుంబ స‌భ్యుల ప్రాబ‌ల్యాన్ని పెంచే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఏపీ అసెంబ్లీలో నారా ఫ్యామిలీ నుంచి బాబు సీఎంగా ఉంటే, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌య్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ‌లో అయితే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూతురు, కొడుకుతో పాటు అల్లుడు, స‌మీప బంధువు వినోద్‌కుమార్ సైతం ప్ర‌జాప్ర‌తినిధులుగానే ఉన్నారు. వీరంతా కేసీఆర్‌కు కొండ‌త బ‌లంగా ఉన్నారు.

ఇక చంద్ర‌బాబు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుటుంబ స‌భ్యుల బ‌లాన్ని పెంచుకునే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం ఖ‌రారైంది. ఈ లోగానే లోకేష్ ఎమ్మెల్సీలోనో లేదా ఎమ్మెల్యేగానో గెలిచి…మంత్రి అయినా అవ్వొచ్చు.

ఇక లోకేష్ కూడా ఏపీ పాలిటిక్స్‌లోనే ఉంటే చంద్ర‌బాబు-బాల‌య్య‌-లోకేష్ ముగ్గురు ఏపీ రాజ‌కీయాల్లోనే ఉన్న‌ట్లు ఉంటుంది. దీంతో త‌న ఫ్యామిలీకి చెందిన ఓ వ్య‌క్తి పార్ల‌మెంటులో కూడా ఉండాల‌న్న‌దే బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇందుకోసం బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కోడలు నారా బ్రాహ్మ‌ణిని ఎంపీగా పోటీ చేయించే ప్లాన్‌లో ఉన్నార‌ని స‌మాచారం.

ఉన్న‌త విద్యావంతురాలు, మంచి వాగ్దాటి ఉన్న బ్రాహ్మ‌ణి పార్ల‌మెంటులో ఎంపీగా ఉంటే ఏపీకి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల విష‌యంలోను, కేంద్ర స్థాయి అధికారుల‌ను ఒప్పించి ప‌లు ప‌నులు చేయించ‌డంలోను చాలా హెల్ఫ్‌గా ఉంటుంద‌న్న ప్లాన్‌లో బాబు ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీకి ప‌ట్టున్న హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లేదా గుంటూరు లోక్‌స‌భ నుంచి గాని బ్రాహ్మ‌ణిని ఎంపీగా పోటీ చేయించాల‌ని బాబు అప్పుడే స‌న్నాహాలు స్టార్ట్ చేశారు.

బ్రాహ్మ‌ణి హిందూపురం ఎంపీగా పోటీ చేస్తే అక్క‌డ సిట్టింగ్ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కు ఎమ్మెల్యే సీటు లేదా ఎమ్మెల్సీ ఇస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఆమె ఏపీ రాజ‌ధానిలో కీల‌కంగా ఉన్న గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తే అక్క‌డి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న జ‌య‌దేవ్‌ను చిత్తూరు నుంచి చంద్రగిరి నుంచి అసెంబ్లీ బ‌రిలో దింపుతార‌ని తెలుస్తోంది. ఏదేమైనా 2019 ఎన్నిక‌ల బ‌రిలో బ్రాహ్మ‌ణి ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌న్న వార్త‌లు టీడీపీలో సంచ‌ల‌నంగా మారాయి.

Videos

5 thoughts on “కోడ‌లికి ఎంపీ సీటు బుక్ చేసిన చంద్ర‌బాబు

Leave a Reply

Your email address will not be published.