భారత్ గెలుస్తుందని తెలిసీ… ఓడించేశాడు!

క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి అవసరం. ఓటమి అంచున ఉన్నా కూడా ఆటను ఆపకూడదు. చివరి దాకా పోరాడటమే ఆటగాడి లక్షణం. ఓడిన తరువాత హుందా విజేతను ఆలింగనం చేసుకోవాలి మనస్ఫూర్తిగా అభినందించాలి. అంతేగానీ ఓటమి నుంచి తప్పించుకోవడం కోసం కుంటిసాకులు వెతుక్కునే క్రీడాకారులను అభిమానులు కూడా ఛీదరించుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్. భారత జట్టు గెలుపు దిశగా పయనిస్తోందని గ్రహించి… ఆటను కొనసాగించేందుకు నిరాకరించాడు. ఆటగాళ్లకు గాయాలైపోయానీ బాధపడుతున్నారనీ ఆడలేకపోతున్నారనీ కుంటిసాకులు చెప్పి భారత్ గెలుపును అడ్డుకున్నాడు.

భారత్ – వెస్టీండీస్ జట్ల మధ్య అమెరికాలో టీ20 మ్యాచ్ జరుగుతోంది! ఈ మ్యాచులో భారత జట్టు గెలిస్తే సిరీస్ సమానం అవుతుంది. రెండు జట్లు సమష్టిగా సిరీస్ పంచుకోవాల్సి వచ్చేది. 144 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. రెండు ఓవర్లలో 15 పరుగులు చేసేవారు ఓపెనర్లు. వర్షం రావడంతో కాసేపు ఆటను నిలిపారు. ఆ తరువాత ఆడేందుకు వెస్టండీస్ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్ నిరాకరించారు! తమ ఆటగాళ్లు గాయాలపాలయ్యారని ఆడలేరి చెప్పాడు. అయితే అసలు విషయం ఏంటో అందరికీ తెలిసిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత జట్టు 5 ఓవర్లలో 28 పరుగులు చేస్తే మ్యాచ్ రద్దైనా సరే భారత్ గెలిచినట్టు అవుతుంది. రెండు ఓవర్లకే భారత్ 15 పరుగులు సాధించేసింది కాబట్టి ఐదు ఓవర్లు దాటకుండానే 28 రన్స్ పూర్తి చేసేస్తుందేమో అనే దురుద్దేశంతోనే ఆటను రద్దు చేశాడు విండీస్ కెప్టెన్. వాన తరువాత ఆటను కొనసాగించమంటూ ఎంతగా బతిమాలినా వినలేదు. చేతులు ఎత్తేసి వెళ్లిపోయాడు.

దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. క్రీడాస్ఫూర్తి ని చాటుకోలేకపోయాడని అంటున్నారు. భారత్ ఆటను మైదానంలో కంట్రోల్ చేయలేక ఇలా దొడ్డి దారిన విండీస్ కు సిరీస్ సాధించిపెట్టాడని విమర్శిస్తున్నారు. నిజానికి ధోనీ సేన ఓడినా అభిమానుల అభిమానాన్ని గెలుచుకుందని చెప్పాలి. క్రీడల్లో ఇలాంటి కుతంత్రాలు చేస్తే ఆటలకు అర్థం ఉండదు కదా!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *