జియో ఫైబర్ తో మళ్ళీ బంపర్ ఆఫర్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో  రిలయన్స్‌  అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ మరోసారి ముఖ్యంగా జియో గిగా ఫైబర్‌ సేవలకు సంబంధించిన అందరూ ఊహించిన దానికంటే  ఎక్కువగా ఆఫర్లను ప్రకటించడం విశేషం.  జియో మాదిరిగాగానే అతి తక్కువ ధరకే ఫైబర్‌ సేవలను భారతీయ వినియోగదారులకు  అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు.  ముఖ్యంగా రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్‌ అవతరించనుందని ముకేశ్‌ ప్రకటించడం  విశేషం.

సెప్టెంబర్ 5 నాటికి జియోకు మూడేళ్లు పుర్తి అవుతాయి, అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ పీఎస్‌ వరకు డేటా ఉచితం.  అలాగే వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4కే ఎల్‌డీ టీవీ, 4జీ హెచ్‌డీ సెట్‌టాప్‌బాక్స్‌ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే  ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో  ప్రాతిపదికన కొత్త సినిమాలు  చూసే అవకాశం కల్పిస్తామన్నారు.  బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని  స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published.