ముమైత్ తో డేట్ చేసిన ఆ నలుగురిలో ఇద్దరు వారే..?

ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ ..ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ అని అందరికీ తెలుసు.ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ ను ఎంతలా బ్లాస్ట్ చేస్తుందే అదే స్థాయిలో తన మాటలను కూడా బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది.గతంలో తాగిన మైకంలో తాను ఎవరెవరితో క్లోజ్ గా ఉన్నది చెప్పేస్తూ..ఎందరినో వణికించింది.ఆ టైమ్లో ముమైత్ ఖాన్ తో మనకెందుకు అనుకుని కొందరు ఆమెతో క్లోజ్ గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపడమే మానేశారు.

గత కొంతకాలంగా ముమైత్ కు సరైన సినిమాలు లేవు.ఎందరో భామలు ఐటమ్ పోరీలుగా మారిపోవడంతో ముమైత్ కు ఆఫర్లు రావడమే మానేశాయి.దీంతో ఇక లాభం లేదనుకుని మళ్లీ టంగ్ స్లిప్ కార్యక్రమాలను షురూ చేసింది.దానిలో భాగంగా తాను ఇప్పటి వరకూ నలుగురితో సహజీవనం చేశానని చెపుకొచ్చింది.దానిలో భాగంగా ఫస్ట్ డేటింగ్ పర్సన్ తో నాలుగేళ్ల పాటు రిలేషన్ కొనసాగిందని చెపుకొచ్చింది.

సెకండ్ రిలేషన్ ముడున్నర ఏళ్ల పాటు కొనసాగితే… మూడు వ్యక్తితో జస్ట్ రెండేళ్లు ఉన్నాని చెపుకొచ్చింది..లాస్ట్ రిలేషన్ మాత్రం ఏడాదిన్నర పాటే సాగిందని చెబుతోంది.అందుకే ఇక నుంచి ఎవరితోను బంధాలు, సంబంధాలు తనకొద్దని అలాగే మనీని వేస్ట్ చేయదలచుకోలేదని చెబుతోంది.అలాగే ఇంకొన్ని కాంట్రవర్సీ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చింది.ఒక వ్యక్తితో రిలేషన్ కోసమని సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని… ఆ ఆపరేషన్ కు 27 లక్షలు ఖర్చయిందని ముమైత్ ఖాన్ చెపుకొచ్చింది.ఎట్ ప్రజెంట్ తన మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయని…వీటితో తనకు ఓ ఎక్స్ మెన్ అనే భావన కూడా కలుగుతోందని చెబతోంది. ప్రస్తుతానికి ముమైత్ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను పెట్టి దాని కార్యక్రమాలను చూసుకుంటూ కాలం గడుపుతోంది.

ఇంతకీ ముమైత్ తో సహజీవనం చేసిన వారిలో ఒకరు ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ నిర్మాత కాగా ఇంకొకరు ఓ స్టార్ కమెడియన్ కు తమ్ముడు అనే  ప్రచారం జరుగుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published.