బెంగళూరుపై ముంబై ఘనవిజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరును పసలేని బౌలింగ్ మళ్లీ కొంప ముంచింది. తొలుత రాహుల్ అజేయ అర్ధసెంచరీతో డిఫెండింగ్ చాంప్ ముంబై ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించినా లాభం లేకపోయింది. పేలవ బెంగళూరు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటు బ్యాట్స్‌మెన్ చేలరేగడంతో ముంబై అలవోక విజయాన్నందుకుంది. రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో పొల్లార్డ్, బట్లర్ మెరుపులతో బెంగళూరు..ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేస్తూ ముంబై ఘనవిజయం  సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై బెంగళూరు ఓపెనర్లు విరాట్ కొహ్లీ (7 పరుగులు), క్రిస్గేల్ (5 పరుగులు) ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఎబీ డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ బెంగళూరు ఇన్నింగ్ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది.

ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్(27 బంతుల్లో 24 పరుగులు) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగినా రాహుల్(53 బంతుల్లో 68, నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ వాట్సన్(14 బంతుల్లో 15)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. చివర్లో సచిన్ బేబి(13 బంతుల్లో 25 పరుగులు, నాటౌట్) మెరవడంతో ముంబై ముందు బెంగళూరు 152 పరుగుల టార్గెట్ను ఉంచింది. ముంబై బౌలర్లలో సౌథీ, మెక్క్లెనగన్, పాండ్యాలకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.

బెంగళూరు నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యఛేదనలో 4 వికెట్లు కోల్పోయి మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. జట్టులో రాయుడు(44) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో పొల్లార్డ్(19 బంతుల్లో 35 నాటౌట్), బట్లర్(11 బంతుల్లో 29 నాటౌట్)మెరుపులు మెరిపించడంతో అలవోక గెలుపు సాధ్యమైంది. ఓ దశలో గెలుస్తుందనుకున్న బెంగళూరు ఆశలను పొల్లార్డ్, బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెరిపేశారు. వాట్సన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మొదలైన పొల్లార్డ్ విజృంభణ ఆఖరి దాకా కొనసాగింది.

రాయుడు నిష్క్రమణతో బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ కూడా పొల్లార్డ్ అండతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆరోన్(2/37) రెండు వికెట్లతో రాణించగా, అరవింద్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. పొదుపైన బౌలింగ్‌తో వికెట్ తీసిన ముంబై లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా(4-0-15-1)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ.. లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. ముంబై జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా స్థానంలో నితిశ్ రానా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ స్థానంలో గేల్, ఇక్బాల్ అబ్దుల్లాకు బదులుగా శ్రీనాథ్ అరవింద్‌ను బెంగళూరు జట్టులోకి తీసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 151/4 స్కోరు చేసింది. లోకేశ్‌రాహుల్(68) అజేయ అర్ధసెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సౌథీ, మెక్‌క్లీగన్, కృనాల్ ఒక్కో వికెట్ తీశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *