ఢిల్లీ పై రోహిత్ సేన ఘనవిజయం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 21 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లు) తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని చాటగా, మార్టిన్ గప్తిల్ (48; 42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్‌ను మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. ఇది మినహా ఢిల్లీ జట్టుకు మరే ఆనందం దక్కలేదు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(86) ఢిల్లీ బౌలింగ్‌ను ఉతికారేశాడు.

భారీషాట్లతో విరుచుకుపడి ముంబై స్కోరుబోర్డును పరుగుపెట్టించాడు. మోరిస్ మినహా మిగతా బౌలర్లందరినీ ఆటాడుకున్నాడు. అర్ధసెంచరీకి కేవలం 22 బంతులే తీసుకున్నాడంటే కృనాల్ జోరెలా సాగిందో తెలుస్తున్నది. చివరకు మోరిస్ ..పాండ్యాను ఔట్ చేసి ఈ ఊచకోతకు తెరదించాడు. పొలార్డ్ (3) విఫలమైనా..చివర్లో రాయుడు (13 నాటౌట్; 5 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్), బట్లర్ (18 నాటౌట్: 9 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) చెలరేగడంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు సాధించింది. మోరిస్ 2 వికెట్లు తీసుకున్నాడు

స్కోరుబోర్డు:

ముంబై:

రోహిత్ (సి) పంత్ (బి) మిశ్రా 31, గప్టిల్ (సి) నాయర్ (బి)జహీర్ 48, కృనాల్ (బి)మోరిస్ 86, పొల్లార్డ్ (సి) డీకాక్ (బి)మోరిస్ 3, బట్లర్ (నాటౌట్) 18, రాయుడు (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 206/4; వికెట్లపతనం: 1-46, 2-144, 3-173, 4-174; బౌలింగ్: నదీమ్ 4-0-42-0, మోరిస్ 4-0-34-2, జహీర్ 4-0-23-1, మిశ్రా 4-0-42-1, తాహీర్ 4-0-59-0.

ఢిల్లీ:

అగర్వాల్(బి)వినయ్ 8, డికాక్(సి)బట్లర్(బి) పాండ్యా 40, నాయర్(సి)బుమ్రా(బి)హర్భజన్8, శాంసన్(రనౌట్/హర్భజన్‌సింగ్/పాండ్యా)6, రిషబ్(బి)బుమ్రా 23, డుమిని(సి)బట్లర్(బి)బుమ్రా 9, మోరిస్(రనౌట్/రాయుడు/బట్లర్)20, మిశ్రా(బి)బుమ్రా 1, నదీమ్ 1 నాటౌట్, తాహీర్(రనౌట్/వినయ్) 5, జహీర్ (బి)పాండ్యా 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.1ఓవర్లలో 126 ఆలౌట్; వికెట్లపతనం: 1-11, 2-46, 3-60, 4-71, 5-96, 6-96, 7-109, 8-118, 9-123; బౌలింగ్: హర్భజన్ 4-0-34-1, వినయ్ 4-0-33-1, మెక్‌క్లీనగన్ 4-0-26-0, బుమ్రా 4-0-13-3, పాండ్యా 2.1-0-15-2, రానా 1-0-3-0.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *