రివర్స్ లో జరుగుతోందేంటి?: చైతూ‘ప్రేమమ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

నాగచైతన్యకు చాలా కాలానికి సోలో హిట్ దొరికింది. చైతూ పేరు చెప్పి చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఎగ్జిటర్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ దసరాకు పేరుకు ఐదు సినిమాలు రిలీజ్ అయినా లీడ్ ఉన్నది మాత్రం ప్రేమమ్ చిత్రమే కావంటతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియావైజ్ అందిస్తున్నాం.

ముఖ్యంగా నాగచైతన్య ఈ చిత్రంలో చూపెడుతున్న మూడు వేరిషేయన్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ ఎక్కువ వస్తారనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారని ట్రేడ్ టాక్. దాంతో మళయాళంలో యూత్ వల్లే ఆ రేంజి హిట్ అయిన ఈ చిత్రం ఇక్కడ ఫ్యామిలీల చొరవతో ముందుకు వెళ్లటం ఆశ్చర్యమే. ముఖ్యంగా వీకెండ్స్ మొత్తం ఆడియన్స్ తో ధియోటర్స్ కళకళ్లాడాయి. అలాగే ప్రేమమ్ ఒరిజనల్ మళయాళి చిత్రం కలెక్షన్స్ తో పోల్చనంతవరకూ ఈ కలెక్షన్స్ అద్బుతమే

మొదట వారం షేర్ ఎంతంటే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ లో 16.5కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో యుఎస్ నుంచి 2.08 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్ణాటక నుంచి 1.58 కోట్లు, బారత్ లో మిగిలిన ఏరియాల నుంచి 0.55 నుంచి వస్తోంది. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీక్ గా దీన్ని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటే రిలీజైన మిగతా సినిమాలేవీ ఈ స్దాయిలో కాదు కదా దగ్గరగా కూడా కలెక్ట్ చేయటం లేదు.

ఎదురేలేకుండా పోయింది దసరా సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. అలాగే శుక్రవారం వచ్చేవరకూ ఇజం తప్ప పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాంగ్‌రన్‌లో నాగ చైతన్య కెరీర్‌కు ప్రేమమ్ సోలో హీరోగా పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

నైజాం లో ప్రేమమ్ కలెక్షన్స్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఫస్ట్ వీక్ 4.45 కోట్లు వసూలు చేసి , డిస్ట్రిబ్యూటర్స్ ని ఆనందపరిచింది.

సీడెడ్ ప్రాంతంలో ప్రేమమ్ ఎంతంటే మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సీడెడ్ ప్రాంతంలో ఫస్ట్ వీక్ 1.95 కోట్లు వచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published.