కుర్రాళ్ళు ముగ్గురూ కేకలే!!

ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే కొందరు రియల్ లైఫ్ డాడ్ అండ్ సన్స్ ఉంటారు. అలాంటివారిలో అక్కినేని త్రయం ఒకరు. ఎందుకంటే వారికి ఏజ్ అనేదే లేదు కాబట్టి. ముఖ్యంగా కింగ్ నాగార్జున ను చూస్తే మాత్రం.. వీళ్లకు నాన్న గారా లేకపోతే అన్నయ్య అన్నట్లుండటమే ఆయన స్పెషాలిటీ.

జి.క్యూ. మ్యాగజైన్ తమ లేటెస్టు ఎడిషన్ కోసం.. ఇండియాలోని పాపులర్ సెలబ్రిటీల్లో తండ్రి-కొడుకులను ఫోటోలు తీసి మరీ వారి గురించి రాసింది. అందులో కింగ్ నాగ్.. ఆయన కుమారులు నాగ చైతన్య అండ్ అఖిల్ కూడా ఉన్నారు. అదిగో అక్కడ ఫోటో చూడండి.. ఒక్క నాగేశ్వరరావు గారు మిస్సయ్యారు తప్పించి.. మరోసారి మనకు ”మనం” సినిమా చూపించేస్తున్నారు అక్కినేని వారు.

చైతన్య అండ్ అఖిల్ కాస్త గెడ్డం పెంచి యూత్ ఫుల్ రఫ్ లుక్ చూపించాలనే ప్రయత్నం చేస్తుంటే.. నాగ్ మాత్రం క్లీన్ షేవ్ లో నవమన్మథుడిలా మెరిసిపోతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనే అని మొన్న సంక్రాంతికి ఈయన్ను ఊరకనే అన్నారేంటండీ మన ప్రేక్షకులు.. వాళ్లకీ తెలుసు ఈయన ఛార్మ్ ఏంటనేది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *