‘బాహుబలి 2’ పై సీక్రెట్ ఎంక్వైరీ, నాగ్ చేతికి బాహుబలి

నాగార్జున నటుడుగా ఏ స్దాయిలో ఉన్నారో అంతకు మించి ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ అని అందరికి తెలిసిందే. ఈ సారి ఆ విషయం మరోసారి రుజువైంది. ఎక్కడ డబ్బులు వస్తాయో నాగార్జున కు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదంటారు. అందుకేనేమో ఆయన బాహుబలి 2 రైట్స్ తీసుకున్నారు. ఆయనకు ఈ చిత్రం గురించి ఇన్ సైడ్ రిపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఆయన ఈ చిత్రం హైలెట్స్ రీసెంట్ గా ఆ సినిమా టీమ్ ద్వారా విన్నాడట.

అవి విన్న ఆయన షాక్ అయ్యి..ఆలస్యం చెయ్యకుండా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు బాహుబలి-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ పేరుతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను మరింత ఆసక్తిగా తెరకెక్కించాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై నెలకొనే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నాగార్జున రంగంలోకి దిగారు.

అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా బాహుబలి యూనిట్తో కలిసాడు. ప్రముఖ నిర్మాత వారాహి చలనచిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటితో కలిసి బాహుబలి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాడు నాగ్.

తొలి భాగానికి దాదాపు 7 కోట్ల వసూళ్లను సాధించిన కృష్ణ జిల్లా పంపిణీ హక్కులను 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు నాగార్జున, సాయి కొర్రపాటి. బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో కూడా రైట్స్ కోసం ప్రయత్నించిన నాగ్ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా హక్కులు సొంతం చేసుకోవటంతో నాగ్ ఎంట్రీ సినిమా ప్రమోషన్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Videos

195 thoughts on “‘బాహుబలి 2’ పై సీక్రెట్ ఎంక్వైరీ, నాగ్ చేతికి బాహుబలి

Leave a Reply

Your email address will not be published.