పోలీసంటే.. నేలమీద నడిచే ‘నక్షత్రం’

సందీప్‌ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్‌ తేజ్, ప్రగ్యా జైశ్వాల్‌ కీలక తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నక్షత్రం’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్టు చూపించాడు కృష్ణవంశీ. ట్రైలర్‌లో ‘భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీసంటే.. నేలమీద నడిచే ‘నక్షత్రం’ పోలీసంటే..’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ పోలీసు పవర్‌ తెలుపుతూ.. పై డైలాగ్‌ చెప్పారు. సందీప్‌ ఎస్సై కావాలని కలలు కంటూ కనిపించారు.

అయితే న‌క్ష‌త్రం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ అన్నీ దాదాపు పూర్తైన‌ట్టు తెలుస్తోండ‌గా, ఈ చిత్రాన్ని జులై 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో మూవీ బిజినెస్ కూడా స్పీడుగా జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. న‌క్ష‌త్రం చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ క్రూషియ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. శ్రీ చక్ర మీడియా, బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.

Videos

8 thoughts on “పోలీసంటే.. నేలమీద నడిచే ‘నక్షత్రం’

Leave a Reply

Your email address will not be published.