సౌతిండియాను షేక్ చేస్తున్నా – నందమూరి సోదరులు

కల్యాన్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేర్లు ఇప్పుడు సౌత్ లోని పక్క రాష్ట్రాల్లో మార్మోగుతున్నాయి. ఒకటి కాదు.. తమిళ, కన్నడ, మాలయాళ చిత్ర సీమల్లో ఇప్పుడు ఈ అన్నదమ్ముల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.. కేవలం ఈ హీరోల సినిమాలే వీళ్లను సౌతిండియాలోనే చర్చనీయమైన వ్యక్తులుగా మారుస్తున్నాయి.ఇప్పటికే ‘జనతా గ్యారేజీ’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కేరళ పాలిట సింగమలైగా మారాడు. ఆ సినిమాను మలయాళంలో భారీ ఎత్తున విడుదల చేయడం ఖాయమైంది.

ఇక ఇదే సమయంలో కన్నడ నాట ఎన్టీఆర్ చర్చనీయాంశంగా మారాడు. ఈ హీరో పాడిన కన్నడ పాట యూట్యూబ్ ద్వారా విడుదల అయ్యింది. పునీత్ రాజ్ కుమార్ సినిమా ‘చక్రవ్యూహ’ లోని ఈ పాట ఇప్పుడు కన్నడనాట మార్మోగుతోంది. దీంతో ఎన్టీఆర్ కన్నడ నాటా రచ్చ చేస్తున్నట్టువుతోంది.ఇక ఇదే సమయంలో.. ‘టెంపర్’ తమిళ రీమేక్ వార్త ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను తమిళంలో శింబు రీమేక్ చేయనున్నాడు. ఎంతైనా ఇది జూనియర్ కు గర్వకారణమే. ఇదే సమయంలో కల్యాణ్ రామ్ సినిమా ‘పటాస్’ తమిళ రీమేక్ విడుదలకు సిద్ధం అయ్యింది. దీంతో ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ ల సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు.. ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళీ భాషల సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Videos

18 thoughts on “సౌతిండియాను షేక్ చేస్తున్నా – నందమూరి సోదరులు

Leave a Reply

Your email address will not be published.