కళ్యాణ్ రామ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. ఫాన్స్ కి బంపర్ న్యూస్!

నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. భారీ బడ్జెట్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాల పాలవుతూ అతనికి భారీ నష్టాల్ని మిగిలిస్తున్నాయి. ఆమధ్య ‘ఓం 3డి’ సినిమాతో టాలీవుడ్‌కి 3డి టెక్నాలజీ పరిచయం చేసిన ఈ హీరోకి.. ఆ చిత్రం నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత చేసిన ‘పటాస్’తో కాస్త కోలుకోగా.. వెంటనే ‘కిక్-2’, ‘షేర్’, ‘ఇజం’ సినిమాలు నష్టాలు ఊబిలోకి నెట్టేశాయి. వాటినుంచి బయటపడాలంటే.. కళ్యాణ్‌కి ఖచ్చితంగా ఓ భారీ సక్సెస్ కావాలి. అందుకే.. తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నాడు. తనకు మంచి సక్సెస్ అందించే దర్శకుడితోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే కొందరి దర్శకుల పేర్లను పరిశీలించాడు కళ్యాణ్. ప్రతిఒక్కరూ రొటీన్ మాస్ మసాలా, ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలే చెప్పడంతో.. అందరినీ రిజెక్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని రూమర్లు ఊపందుకున్నాయి. తనకు ‘పటాస్’లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన అనిల్ రావిపూడితో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడని రూమర్లొచ్చాయి. అతను చెప్పిన మంచి స్క్రిప్టు నచ్చడంతో.. దానికి కళ్యాణ్ రామ్ కూడా ఓకే అన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కళ్యాణ్ రామ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ కోసం కథ రెడీ చేస్తున్నారని.. కళ్యాణ్ ఈ మూవీ మీద దృష్టి సారించాడని టాక్ నడించింది. అనంతరం.. కళ్యాణ్ రామ్‌తో సినిమా చేసేందుకు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు గాసిప్పులు గుప్పుమన్నాయి. చివరికి అవన్నీ గాలివార్తలేనని ఓ క్లారిటీ వచ్చేసింది. మరి.. కళ్యాణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడా? అని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అయిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ‘షేర్’, ‘ఇజం’లాంటి మాస్ సినిమాలు దెబ్బకొట్టిన నేపథ్యంలో.. ఈసారి తన ఇమేజ్‌కి భిన్నంగా కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేయాలని ఫిక్స్ అయి.. నాగేశ్వరరెడ్డితో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. పైగా.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లిస్తాడని నాగేశ్వరరెడ్డి మంచి పేరుంది. అందుకే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆయనతో చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని, అతనితోనే మూవీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడట. మరి.. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఒకవేళ ఓకే అయితే మాత్రం.. కళ్యాణ్ రామ్ ఖాతాలో ఖచ్చితంగా ఓ హిట్ పడినట్లే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *