నంద్యాల ఉప ఎన్నిక అప్‌ డేట్స్‌…

చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు  పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకూ 32.4 శాతం పోలింగ్‌ నమోదైంది. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తుండడం విశేషం. బూత్‌ నంబర్ 152లో  సరిగా వెలుతురు లేకపోవడంతో …..ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.  దాదాపు  255 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

♦ రికార్డ్‌ పోలింగ్‌ శాతం దిశగా: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 71.91 శాతం పోలింగ్‌నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నంద్యాల గ్రామీణంలో 81.10 శాతం, నంద్యాల అర్బన్‌లో 67.60 శాతం, గోస్పాడు మండలంలో 81.14 శాతం ఓటింగ్‌ నమోదయినట్లు ఈసీ పేర్కొంది.

♦మధ్యాహ్నం 1గంట వరకూ 53.1 శాతం పోలింగ్‌ నమోదు
♦ఒంటి గంట వరకూ పోలైన ఓట్లు లక్షా 16వేల 214
♦పోలైన ఓట్లలో మహిళలు 59,954, పురుషులు 56,260

♦నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నేతలు
♦వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న మంత్రి అఖిలప్రియ

♦నంద్యాల మండలం ఒంటిగంట వరకూ రూరల్‌లో భారీగా పోలింగ్‌
♦చాపరేవులలో 2750కి 2100 ఓట్లు పోల్‌
♦మిట్నాలలో 1500కి 860, భీమవరంలో 1800కి 1000 ఓట్లు పోల్‌
♦గుంతనాలలో 700కి 600..బ్రాహ్మణపల్లిలో 560కి 460 ఓట్లు పోల్‌

♦రికార్డు స్థాయి పోలింగ్‌ దిశగా దూసుకెళ్తున్న నంద్యాల
♦పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్న శిల్పా మోహన్‌ రెడ్డి
♦ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాలి
♦ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించండి

♦పోలీస్‌ ఉన్నతాధికారితో ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి మంతనాలు
♦గోస్పాడు మండలం యళ్లూరులోని ఓ ఆలయంలో భేటీ

♦గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌
♦చాపరేవులలో మధ్యాహ్నం 12 గంటల వరకూ 75 శాతం పోలింగ్‌ నమోదు
♦2,750 ఓట్లకుగాను పోలైన 2,050 ఓట్లు

♦నంద్యాల 74,76 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
♦అడ్డుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, వాగ్వాదం
♦గోస్పాడు మండలం పార్వతీపురంలో ఈవీఎం మొరాయింపు

♦స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం
♦యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు
♦అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం
♦ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందంటున్న వైఎస్‌ఆర్‌సీపీ
♦ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు
♦తక్షణమూ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

♦స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం
♦యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు
♦అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం
♦ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందంటున్న వైఎస్‌ఆర్‌సీపీ
♦ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు
♦తక్షణమూ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

♦యళ్లూరులో తిరుగుతున్న బనగానపల్లె ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డి
♦ఎమ్మెల్యే స్టిక్కర్‌ఉన్న ఫార్ఛునర్‌ కారులో సంచారం
♦ఎస్‌బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం
♦నిబంధనల ప్రకారం కర్నూలు జిల్లాలో స్థానికేతరులు ఉండరాదు

♦టీడీపీ కౌన్సిలర్‌ భర్త ప్రసాద్‌ హల్‌చల్‌
♦27వ వార్డులో కౌన్సిలర్‌ హారిక, ప్రసాద్‌ అధికార దుర్వినియోగం

♦అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దని రవిచంద్ర కిషోర్‌ రెడ్డి సూచన
♦అందరూ ఓటువేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి
♦మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం
♦ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

♦మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్‌ రెడ్డి హల్‌చల్‌
♦నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన విఖ్యాత్‌

♦నంద్యాల ఎస్‌బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం
♦ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

♦ఉదయం 11 గంటల వరకూ 32.4 శాతం పోలింగ్‌ నమోదు
♦ఓటు హక్కు వినియోగించుకున్న 70,909 ఓటర్లు
♦ఓటు వేసిన 36,305 మంది పురుషులు, మహిళలు 34,604

♦చాబోలులో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
♦ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే

♦నంద్యాలలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం
♦పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ క్యూలు
♦క్యూలైన్‌లో పెద్ద ఎత్తున బారులు తీరిన మహిళలు
♦ప్రలోభాలకు లొంగకుండా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు
♦పలు గ్రామాల్లో ఇప్పటికే 40శాతం దాటిన పోలింగ్‌
♦నంద్యాల పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాల్లోనూ భారీగా ఓటింగ్‌

♦వైఎస్‌ఆర్‌ సీపీకి గట్టి పట్టున్న వైఎస్‌ఆర్‌ నగర్‌లో టీడీపీ నేతల స్వైర విహారం
♦టీడీపీ అభ్యర్థి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి హల్‌చల్‌
♦ఎటువంటి పాస్‌లు లేకుండానే ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్న నేతలు

♦కొనసాగుతున్న అధికార పార్టీ ప్రలోభాల పర్వం
♦ఎన్టీఆర్‌ షాదీఖానా వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మకాం
♦12వ వార్డులోని ఓ ఇంట్లో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, మణిగాంధీ
♦144 సెక్షన్‌ అమల్లో ఉన్నా ఖాతరు చేయని టీడీపీ నేతలు

♦ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేలు
♦నంద్యాలకు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌, పార్టీ నేత చమన్‌
♦ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు

♦నందమూరి నగర్‌లో భూమా మౌనిక ప్రచారం
♦మౌనికతో పాటు ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేతల ప్రచారం

♦పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు

♦ నంద్యాల నందమూరి నగర్‌లో కేంద్ర బలగాల పహారా
♦టీడీపీ కౌన్సిలర్‌ శివశంకర్‌ డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు

♦ఏపీ సచివాలయంలోనూ అధికార దుర్వినియోగం
♦కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ
♦ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారులకు మంత్రుల ఆదేశాలు

♦నంద్యాలలోకి ప్రవేశించిన ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మణిగాంధీ
♦నంద్యాల 94,97 పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంల మొరాయింపు

♦మెజార్టీ పోలింగ్‌ బూత్‌లలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు అనుమతి
♦వైఎస్‌ఆర్‌ సీపీ ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వకుండా వేధిస్తున్న అధికారులు
♦10వ వార్డు శారదా విద్యాపీఠం వద్ద సర్వే పేరిట ఓటర్లకు బెదిరింపులు

♦ఉదయం 9 గంటల వరకూ 17 శాతం పోలింగ్‌ నమోదు
♦ఓటు హక్కు వినియోగించుకున్న 37,236 మంది ఓటర్లు
♦ఓటు వేసిన మహిళలు (18,245) పురుషులు (18,991)

♦నంద్యాలలో మంత్రి ఆదినారాయణరెడ్డి అత్యుత్సాహం
♦గోస్పాడు మండలం దీబగుంటలోవైఎస్‌ఆర్‌ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి
♦నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన అధికారులు

♦నంద్యాలలోని 84, 85, 86 బూత్‌లలో టీడీపీ రిలీవింగ్‌ ఏజెంట్ల హల్‌చల్‌
♦వైఎస్‌ఆర్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *