‘బాహుబలి’కి దర్శకత్వం వహించిన నాని!

బాహుబలి షూటింగ్ నిర్విరామంగా రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న విషయం తెలిసినదే. ఏరోజుకారోజు తమ షూటింగ్ లో జరుగుతున్న ఆసక్తికరమైన అంశాలను ఆ రోజు చివర స్నాప్ చాట్ సహాయంతో పొందుపరుస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ’ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, తాజాగా వచ్చిన ’జెంటిల్‌మన్’ లాంటి హిట్ సినిమాలతో హీరో నాని తారాపథంలో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న నాని, ఆ సినిమా షూటింగ్‌లో భాగంగానే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉన్నారు.

అయితే నిన్న బాహుబలి షూటింగ్ ని కాసేపు యువహీరో నాని డైరెక్ట్ చెయ్యడం విశేషం. తన లేటెస్ట్ మూవీ జెంటిల్ మన్ సినిమా క్యాప్షన్ హీరో? విలన్? అన్నదానికి ప్రత్యుమ్న్యాయంగా హీరో? డైరెక్టర్? అంటూ పోస్ట్ చెయ్యడం విశేషం.  నిజానికి నాని హీరోగా నటించకముందు బాపు వంటి దిగ్గజ దర్శకులదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసినదే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *