కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ రివ్యూ

నాని న్యూ “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ”

కథ :
అనంతపురం జిల్లా హిందూపురంలో కృష్ణగాడు(నాని) బోర్ వెల్స్ వేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే మహాలక్ష్మీ(మెహరీన్)  ప్రేమ ను గెలుచు కుంటాడు హీరో కృష్ణ   అయితే కృష్ణ ప్రేమించిన మహాలక్ష్మి  అదే ఊరిలో  ఆ ప్రాంతాన్నిఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న లీడర్ రాజన్న(మహదేవన్)  ,  తన కనుసైగలతో శాసించే  బలం బలాన్ని కలిగి ఉంటాడు . అతని కుడిభుజం మరాజు(రామకృష్ణ)చెల్లెలు.
ఆ విషయం ఆమె అన్న రామరాజుకు చెప్పలేక పదిహేనేళ్లుగా ఆ విషయాన్ని నానుస్తుంటాడు. మహాలక్ష్మీ తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయకుండా ఉండటం కోసం కావాలనే డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పండగ సెలవులకు రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్) పిల్లలు రాజన్న దగ్గరకు వస్తారు. వాళ్లంతా ఇంట్లో ఉన్న సమయంలో రాజన్న మీద ఎటాక్ జరుగుతోంది. ఆ ఎటాక్ నుంచి పిల్లలను తప్పించిన రామరాజు, వాళ్లను హైదరాబాద్ లోని రాజన్న తమ్ముడికి అప్పగించమని కృష్ణకు చెప్తాడు. అలా చేస్తే తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. తన ప్రేమ కోసం పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లడానికి అంగీకరించిన నాని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అసలు రాజన్న మీద దాడి చేసింది ఎవరు..? కృష్ణగాడి ప్రేమకథకు దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్ కి సంబంధం ఏంటి..? చివరకు కృష్ణగాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ.

ప్లేస్ పాయింట్స్ :
తనేంటో ఇప్పటికే నిరుపించుకున్న నాని మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.  ఈ సినిమాతో పరిచయం అయిన మెహరీన్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ప్రేమికుడిగా, పిరికివాడిగా అద్భుతమైన నటనతో నాని  అలరించాడు. రాజన్నగా మహదేవన్, రామరాజుగా రామకృష్ణల నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్ మరోసారి తన మార్క్ చూపించగా. దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్ పాత్రలో మురళిశర్మ నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యింది క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో నాచురల్ స్టార్ గా తనకు ఇచ్చిన టైటిల్ ను జస్టిఫై చేసుకున్నాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ లో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. . సత్యం రాజేష్, 30 ఇయర్స్ పృథ్వీల కామెడీ టైమింగ్ బాగుంది.

రేటింగ్ :3.0/5.0

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *