గూగుల్ లోకేష్ కి లెటర్ రాశాడంట?

ఇప్పుడు టిడిపిలో ఒక హాట్ టాపిక్ చర్చగా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాల పట్ల ప్రజా క్షేత్రంలో ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు విద్యావంతులు మాత్రమే ఉండే సోషల్ మీడియా లో ఉంది. అది వివిధ రూపాల్లో బయట పడుతూనే ఉంది.అది ఓర్వలేకనే ఇంటూరి రవి కిరణ్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి భయపెట్టాలని చూసింది బాబు సర్కార్. కాని అది కాస్త రివర్స్ కొట్టి తన మెడకే చుట్టుకోవడంతో వదిలేయక తప్పని పరిస్థితి. ఒక్క దెబ్బతో రవి కిరణ్ హీరో కూడా అయ్యాడు. సోషల్ మీడియా సైనికులకు తన పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇవ్వడంతో సోషల్ సైనికులు తమ కలాలకు ఇంకా పదును పెడుతున్నారు.

ముఖ్యంగా చినబాబు లోకేష్ ని టార్గెట్ చేసి మరీ ట్రాల్ చేయటం బాబుకి సైతం విపరీతమైన అసహనం కలిగిస్తోంది. దీన్ని నియంత్రించడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదని అర్థం చేసుకున్న బాబు అండ్ బ్యాచ్ దీని పై వ్యతిరేకంగా మాట్లడడం తగ్గించుకున్నారు. ఇప్పుడు లోకేష్ ఈ వ్యవహారం మొత్తం కూపీ లాగేందుకు సిద్ధపడ్డాడని టాక్. తను నేతృత్వం వహిస్తున్న ఐటి శాఖ కీలక అధికారులతో పాటు తన పర్సనల్ టీం కి కూడా అసలు ఫేస్ బుక్ లో తమ మీద ఎలా ఎటాక్ జరుగుతోంది, వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్లు ఇంత చురుగ్గా ఎలా తనను డ్యామేజ్ చేస్తున్నారో, పప్పు అనే పేరు తన ఫోటో మీద ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటో మొత్తం ఆరా తీసే పనిలో పడ్డారని తెలిసింది.

ఇక మరో ఆశ్చర్యం కలిగించే వార్త మరొకటి ఉంది. గూగుల్ లో పప్పు అని టైపు చేస్తే ముందుగా లోకేష్ ఫొటోనే ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. దాని మీద కూడా చినబాబు సీరియస్ అయ్యారట. అసలు పప్పు అని టైపు చేస్తే తన పేరు రావడం గురించి ప్రశ్నిస్తూ గూగుల్ కి లేఖ కూడా రాసినట్టు తెలిసింది. SEO(సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేశన్) నిపుణులతో కూడా దీని గురించి చర్చించి వాళ్ళ సలహా మేరకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి తనయుడు, అందులోనూ కీలక శాఖకు మంత్రి కాబట్టి గూగుల్ స్పందిస్తుంది. త్వరలో గూగుల్ లో పప్పు అని కొడితే లోకేష్ ఫోటో రాకపోవచ్చు. కాని సోషల్ మీడియా లో దీని గురించి ఎంత ఆడుకోవలో అంతా ఆడేసుకున్నారు. పైగా ఏదో ఒక సందర్భంలో లోకేష్ ఇంకా ఇలాంటి విషయాల్లో దొరుకుతూనే ఉన్నాడు.

మొన్న ప్రెస్ తో మాట్లాడుతూ తాను పప్పు నో అవినీతిపరుడినో ఏదో ఒకటి తేల్చమని చెప్పడం చూస్తే ఆ రెండింటిలో తాను ఒకటి అని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. ఇలా ఏదో ఒకటి స్లిప్ కావడం మీడియా లో టార్గెట్ కావడం చినబాబు కి కామన్ అయ్యింది. గూగుల్ లో అయితే కంప్లయింట్ ఇచ్చి పప్పు అనే పేరుకి ఫోటో డిలీట్ చేయించవచ్చు కాని జనం మనస్సులో బాగా ప్రింట్ అయిన పప్పు ఇమేజ్ ని చేయించగలమా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *