రూ.2 వేల నోటు టెంపరరీయా?

రూ.2 వేల నోట్లపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దానికి సరిపడా చిల్లర దొరక్కపోవడం ఒకెత్తయితే – నాణ్యత లేకపోవడంతో క్రమంగా పాడవుతాయని… చెల్లుబాటు కష్టమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. రూ.2 వేల నోటు తాత్కాలికంగా ప్రవేశపెట్టిందేనని… నోట్ల రద్దు తరువాత వ్యవస్థ మొత్తం  చక్కబడిన తరువాత… దాన్నీ రద్దు చేస్తారని భావిస్తున్నారు.

500 – 1000 నోట్ల రద్దుతో తగ్గిన క్యాష్ ఫ్లోను కవర్ చేయడానికి మాత్రంమే ఈ నోటును ప్రవేశపెట్టినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలోకి కొత్త 500 – 1000 నోట్లు పూర్తిగా వచ్చి చేరాక రూ.2వేల నోట్లను వెనక్కు తీసుకుంటారని భావిస్తున్నారు.

దీనివల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి… పెరుగుతున్న చిల్లర సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మరోవైపు ఇంత పెద్ద దెబ్బ తరువాత కూడా మళ్లీ 2 వేల నోట్ల రూపాయల నోట్ల రూపంలో నల్లధనం పోగేసుకుంటున్నవారికి వెంటనే ఇంకో షాక్ ఇచ్చినట్లవుతుంది. అంతేకాదు.. కరెన్సీ చేతిలో ఉంటే ఎప్పుడేమవుతుందో అన్న భయం కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేకున్నా అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అయితే… అది ఎన్నికల్లో మళ్లీ మోడీ గెలిచాకే అమలు చేయొచ్చని వినిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published.