డోపింగ్ కేసులో నాడా క్లీన్‌చిట్ : రియోకు నర్సింగ్!

భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్‌యాదవ్ రియో ఒలింపిక్స్ కల ఫలించబోతున్నది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతూ యావత్ దేశ ప్రజల్లో ఆసక్తి రేపిన నర్సింగ్ డోపింగ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. నర్సింగ్ ఒలింపిక్స్ ఆశలు కలగానే మిగిలిపోతాయా అనుకున్న సగటు అభిమాని నిర్వేదం పటాపంచలైంది. రెజ్లింగ్ అభిమానుల్లో అమిత ఆనందాన్ని నింపుతూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సోమవారం తుదితీర్పునిచ్చింది. ఉద్దేశపూర్వకంగా అతనిపై డోపింగ్ కుట్ర జరిగిందని తమ సుదీర్ఘ దర్యాప్తులో తేల్చిన నాడా నర్సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ 74 కిలోల ఫ్రీ ైస్టెయిల్ విభాగంలో యాదవ్ బరిలోకి దిగేందుకు లైన్ క్లియర్ అయ్యిం ది. నర్సింగ్ డోపింగ్ కేసులో వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన నాడా.. భారత క్రీడా ప్రాధికారిక సంస్థ(సాయ్) కేంద్రంలో కొందరు సహచర రెజ్లర్లు కావాలని కుట్రకు పాల్పడినట్లు పేర్కొంది.

జూన్ 25న సేకరించిన శాంపిల్స్‌తో పోలిస్తే గత నెల 5న తీసుకున్న రెండో శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం మెథన్‌డైనోన్ తక్కువ మోతాదులో ఉన్నట్లు నాడా తమ పరిశీలనలో తేల్చింది. డోపింగ్ వివాదంలో వ్యక్తిగతంగా నర్సింగ్ తప్పుగానీ, ఉదాసీనత గానీ లేదు. కావాలని కొంత మంది చేసిన కుట్రకు నర్సింగ్ బలయ్యాడు. డోపింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ యాదవ్ తప్పిదం ఏమీ లేదని తేల్చింది. నాడా 2015 యాంటీ-కోపింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం అతనికి ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం కల్పిస్తున్నాం అని తీర్పు సారంశాన్ని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ మీడియాకు చదువుతూ వెలువరించాడు. నాడా తీర్పు వెలువడగానే నర్సింగ్ అభిమానులు సంతోషంతో సంబురాలు చేసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *