విక్రమ్ ల్యాండర్ కోసం నాసా ప్రయత్నం

చందమామ ఉపరితలంపై దిగిన అనంతరం జాడ తెలియరాకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం ఇక ఏకంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలో దిగింది. హలో అంటూ ఏకధాటిగా జాబిల్లి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపిస్తోంది. డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి నాసా సంకేతాలను పంపిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో చివరిక్షణంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.

Videos