న‌య‌న‌తార‌ను నాశ‌నం చేసిన హీరో

ఆమె కేరీర్ గ‌త మూడేళ్లుగా చూస్తే 10 సినిమాలు.. అందులో 8 విజ‌యాలు.. అడుగు పెట్టిన ప్ర‌తీ సినిమా విజ‌య‌మే.. ప‌క్క హీరోయిన్లు కుళ్లుకునే స్టార్ డ‌మ్. ఆమె రేటు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల‌కు పెరిగింది. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాత‌లు క్యూలో ఉంటున్నారు. రేటు ఎంత అయినా ఆమె ఓకే చెపితే చాలు అన్న‌ట్టు న‌య‌న‌తార‌ జ‌ర్నీ. అమ్మ‌డు అడుగుపెడితే ఫ్లాపయ్యే సినిమా కూడా హిట్టైపోతుంది.

ఆమె ప‌ట్టింద‌ల్లా బంగారం అన్న‌ట్టుగా సాగుతున్న ఆమె కేరీర్‌ను ఓ ఐరెన్‌లెగ్ నాశ‌నం చేశాడు. అంటే ఆ హీరో న‌య‌న‌ను ఏమీ చేయ‌క‌పోయినా … స‌ద‌రు హీరోతో న‌య‌న న‌టించిన సినిమా బొక్క‌బోర్లా ప‌డింది. ఆ హీరోనే జీవా. దుర‌దృష్టానికి ఆధార్ కార్డ్ అంటూ ఉంటే అది జీవానే ఇప్పుడు. మ‌నోడి బ్యాడ్ టైమ్ అలా ఉంది మ‌రి. జీవా వ‌రుస‌గా ఐదు ప్లాపు సినిమాల్లో న‌టించాడు. క‌నీసం న‌య‌న‌తో జ‌త‌క‌డుతున్నా క‌దా… ఆమె అదృష్టం త‌న‌కు కూడా క‌లిసొచ్చి హిట్ కొడ‌తాన‌ని అనుకుంటే ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌న దుర‌దృష్టాన్ని న‌య‌న‌కు కూడా అంటించేశాడు.

రీసెంట్ గా వీళ్లు న‌టించిన తిరునాల్ ఫ్లాపైంది. జీవాకు ఇది వ‌ర‌స‌గా ఆరో ప‌రాజ‌యం. గ‌త వార‌మే విడుద‌లైన తిరునాల్.. మూడు రోజుల్లో కేవ‌లం 6 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. జీవా స్థాయికి ఇవి చాలా త‌క్కువ వ‌సూళ్లు. ఒక‌ప్పుడు రెండు రోజుల్లోనే 7 కోట్ల మార్క్ అందుకున్నాయి జీవా సినిమాలు. కానీ రూర‌ల్ స్టోరీ.. న‌య‌న‌తార‌-జీవా కెమిస్ట్రీ ఏవీ తిరునాల్ సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. దీంతో న‌య‌న కేరీర్‌లో మూడేళ్ల త‌ర్వాత ఓ డిజాస్ట‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు న‌య‌న తెలుగులో వెంకీతో న‌టించిన బాబు బంగారం ఈ నెల 12న రిలీజ్ అవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *