వైరల్: బయటకు వచ్చిన నయీమ్‌ షాద్‌నగర్‌ డెన్‌ వీడియో

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు చెందిన కీలక వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అతడి ఎన్‌కౌంటర్‌కు ముందు తలదాచుకున్న షాద్‌నగర్‌ మిలీనియమ్‌ టౌన్‌షిప్‌లోని ఉనూర్‌ బాషా ఇంటి లోపలి వీడియోలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ ఇంటికి కాస్త దూరంలోనే  ఇతగాడి డెన్  ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఆ సందర్భంగా వీడియో తీసినట్లు చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో నయిం డెన్ లో ఉన్న ఆయుధాలను కళ్లకు కట్టినట్లుగా తాజా వీడియో చూపిస్తుందని చెప్పాలి.

అప్పట్లో అధికారులు ఈ ఇంట్లో భారీ మొత్తం నగదు, డాక్యుమెంట్లు, ఆయుధాలు గుర్తించారు. బెడ్‌రూమ్‌లోని బీరువా సమీపం లో రెండు కవర్లలో భారీ సంఖ్యలో ఉన్న తూటాలు, ఓ బ్యాగ్‌లో ఉంచిన కార్బైన్, రివాల్వర్‌తో పాటు మరో కవర్‌లో ఉన్న రెండు కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని వీడియో ద్వారా చిత్రీకరించారు. అప్పటి నుంచి గోప్యంగా ఉండి పోయిన ఈ వీడియో పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి ఆదివారం హల్‌చల్‌ చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *