షాకింగ్ ట్విస్ట్: నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదా?

ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. శిల్పాకు వైసీపీ ఇచ్చిన బీఫాంను నోటరీ చేసిన న్యాయవాది రామతులసిరెడ్డి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్‌తోనే ముగిసిందని చెబుతూ.. దానికి సంబంధించిన లేఖను కూడా జిల్లా రిజిస్ట్రార్ నుంచి తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌కు అందించారు. అంతేకాకుండా శిల్పా మోహన్‌రెడ్డి తన నామినేషన్ పాత్రల్లో జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ కూడా దాఖలు చేయలేదని మరో అభ్యంతరాన్ని కూడా టీడీపీ లేవనెత్తింది. టీడీపీ ఇచ్చిన లేఖను ఈసీ పరిశీలిస్తోంది. ఇదే విషయంపై ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సంబంధిత నిపుణులతో చర్చిస్తున్నారు.

శిల్పా మోహన్‌రెడ్డి తన డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడితో నామినేషన్ వేయించారు. అయితే అది కూడా గడువు ముగిసిన నోటరీతో ఉండడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. 2009లో కదిరి బాబూరావు నామినేషన్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు నామినేషన్‌ను తిరస్కరించారని, ఇప్పుడు కూడా అదే జరగొచ్చని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.
Videos

2,322 thoughts on “షాకింగ్ ట్విస్ట్: నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదా?