న్యూజిలాండ్‌ ఫై శ్రీలంక ఘోర పరాజయం

న్యూజిలాండ్‌ తో  శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవి చూసింది. శనివారం జరిగిన తొలి మ్యాచులో శ్రీలంక ఏడు వికెట్ల తేడా ఓడిపోయింది . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 47 ఓవర్లలో 188 పరుగులకు చేతులెత్తేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో సిరివర్ధనే (66), కులశేఖర (58) అర్థ సెంచరీలు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు.
ఆనంతరం  బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్  ఓపెనర్ గుప్తిల్ (79), మెకల్లమ్ (55) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు శ్రీలంక బౌలింగును చిత్తు చేశారు. జట్టు స్కోరు 108 పరుగులు ఉన్నప్పుడు మెకల్లమ్ అవుటయ్యాడు. ఆ తర్వతా 162 పరుగుల వద్ద లాథమ్ (18) పెవిలియన్ దారి పట్టాడు.   కేవలం 21 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ 191 పరుగులు చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *