ఆపిల్‌ ఐ ఫోన్‌తో పోటీ.. తనకు తనే సాటి

ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి దిగ్గజ కంపెనీలను నిలువరించి మార్కెట్‌లో రారాజుగా వెలిగేందుకు మళ్లీ రంగంలోకి వచ్చిన నోకియా తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ నోకియా 8ను బుధవారం లాంచ్‌ చేసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ఆపిల్‌ ఐ ఫోన్‌ 8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8లు మార్కెట్లో నోకియా 8 దెబ్బకు కుదేలవుతాయని నిపుణులు భావిస్తున్నారు. విడుదలైన ఫోన్‌ వచ్చే నెల నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. డ్యుయల్‌ లెన్స్‌ కెమెరా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.  డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో, మార్కెట్‌లోని లీడింగ్‌ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ ప్రధాన ఆకర్షణగా నోకియా 8 విడుదలైంది.

బ్లూ, గోల్డ్‌ బ్లూ, గోల్డ్‌ కాపర్‌, స్టీల్‌ కలర్‌ ఆప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (6జీబీ-128 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌- 64 జీబీ స్టోరేజ్‌) నోకియా 8 అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు వచ్చే ఏడాది 8 జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్‌ చేసేందుకు నోకియా సన్నాహాలు చేస్తోంది. దీని  ధర రూ.45,200/-లు గా ఉంటుందని భావిస్తున్నారు.

నోకియా 8 ఫీచర్స్‌

5.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 2560  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌
4 జీబి ర్యామ్‌
64 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
13 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా(4కే వీడియో)
12 మెగా పిక్సెల్  ఫ్రంట్  కెమెరా
3500 ఎంఏహెచ్‌  బ్యాటరీ

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *