రాజ్యసభ ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్

రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 57 సీట్ల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ 57 ఖాళీల్లో తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి జూన్ 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న పోలింగ్, అదే రోజు సాయంత్రం వరకు కౌంటింగ్ కూడా పూర్తి కానుంది. ఇదిలా ఉండగా రాజ్యసభ సీట్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల్లో గట్టి పోటీ ఏర్పడింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *