జనతా సక్సెస్.. ఎన్టీఆర్ కంటతడి

ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మించిన చిత్రం ‘జనతాగ్యారేజ్‌’. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపడంతో హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

”ఆడియో ఫంక్షన్‌లో నాకు ఒక వెలుగు కనిపిస్తుందని చెప్పాను. ఆ వెలుగు జనతాగ్యారేజ్‌ అని తెలుస్తుంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాలుగు రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపై, ఈ కథపై పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోపల చాలా బాధ పడిపోయాను అని ఎన్టీఆర్ తెలిపారు. కానీ అదే రోజుల అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా,ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. జనతాగ్యారేజ్‌ వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషం, నా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చినవాడినయ్యాను అన్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

నేను,కల్యాణ్‌ రామ్‌ అన్నయ్య చాలా బాధగా ఉందని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను. నా వెనుక నా అభిమానులు ఆగారు. అభిమానులు ముందు తలెత్తుకునేలా చేసిన జనతాగ్యారేజ్‌ సినిమాను ఇచ్చిన కొరటాలశివగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేశారు. నా గుండెలో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయమిదని ఎన్టీఆర్ తెలిపారు.

ఒకవైపు ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను. అభిమానులను సంతోషపరచడానికే నేను ఇక్కడ ఉన్నాను. జనతాగ్యారేజ్‌ విజయం కొత్త ఊపిరిని, కొత్త ఆనందాన్నిచ్చింది. బ్రతికినంత కాలం అభిమానుల ప్రేమను, అప్యాయతను పొందాలనే కోరుకుంటున్నాను. ఇంత పెద్ద విజయంలో భాగమైన నటీనటులకు, టెక్నిషియన్స్‌ థాంక్స్‌. జనతాగ్యారేజ్‌ అని ఏరోజైతే టైటిల్‌ పెట్టుకున్నామో ఆరోజు ప్రజలు మమ్మల్మి గుండెల్లో పెట్టుకుని తలెత్తుకునేలా చేశారు అని ఎన్టీఆర్ తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *