షాకింగ్: జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న జనతా గ్యారేజ్ మూవీపై ఇప్పుడో సెన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. సినిమా ప్రారంభంలోనే రిలీజ్ డేట్ ప్రకటించి.. అందుకు తగ్గట్లుగా షూటింగ్ పూర్తి అవుతోందంటూ జనతా గ్యారేజ్ యూనిట్ అప్ డేట్స్ ఇచ్చింది. ఆగస్ట్ 12 డేట్ న ఖచ్చితంగా విడుదల ఉంటుందని చెప్పడంతో.. అందుకు అనుగుణంగా మిగిలిన సినిమాల ప్లానింగ్స్ జరిగాయి.

ఇప్పుడు హఠాత్తుగా జనతా గ్యారేజ్ ను సెప్టెంబర్ 2కి పోస్ట్ పోస్ చేస్తున్నట్లుగా యూనిట్ నుంచి సమాచారం అందింది. ఇదేదో గాసిప్ టైపు వార్త కూడా కాదు.. మేకర్స్ నుంచి అందిన అఫీషియల్ న్యూస్. తప్పనిసరి పరిస్థితులు.. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. అయితే వాయిదా పడ్డం తమకేమీ బాధ లేదని.. తాము అనుకున్న దానికంటే ఔట్ పుట్ గొప్పగా వచ్చిందని అంటున్నారు.

ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో మాట తప్పినా.. కొరటాల క్లారిటీపై చాలామంది నమ్మకం ఉంచారు. పాటలు తప్ప వేరే ఏమీ పెండింగ్ లేదని కూడా చెప్పిన యూనిట్.. ఇప్పుడు హఠాత్తుగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో.. అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published.