ఫిబ్రవరి 11న ఎన్టీఆర్ ‘జై లవకుశ’

జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త సినిమా ఫిబ్రవరి 11న ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను పవర్, సర్థార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఇటీవల కళ్యాణ్ రామ్ జై లవకుశ అనే పేరు రిజిస్టర్ చేయించటంతో ఎన్టీఆర్ సినిమా టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే టైటిల్ కు సంబంధించి యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆరునెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.